ధాన్యం కొనుగోలు వెంటనే మిల్లులకు తరలించాలి:  జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ధాన్యం కొనుగోలు వెంటనే మిల్లులకు తరలించాలి:  జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ధాన్యం కొనుగోలు అనంతరం  వెంటనే  మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యాపేటలోని రామకోటి తండా పి పి సి ధాన్యం కొనుగోలు సెంటర్  ను, శాంతినగర్లోని నవరత్నా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా  రామకోటి తండాలోని పిపిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. అక్కడినుండి సూర్యాపేట శాంతినగర్ లోని నవరత్నా బాయిల్డ్ ఇండస్ట్రీని తనిఖీ చేశారు అక్కడ జరుగుతున్న దిగుమతులను పరిశీలించారు. కేంద్రాల నుండి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని షిఫ్టింగ్ చేయాలని రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వేగంగా జరిగేలా చూడాలన్నారు. రైసు మిల్లులలో హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం దిగుమతి వేగంగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.